VIDEO: మల్కాజ్‌గిరి వెంకటేశ్వర స్వామికి అభిషేకాలు
MDCL: మల్కాజ్‌గిరి పరిధి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అభిషేక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం ప్రత్యేక మంగళ వాయిద్యాల మధ్య స్వామివారికి పంచామృత అభిషేకం, అష్టోత్తర శతనామ పూజలు జరిపి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులు పురుషోత్తమ మాసం సందర్భంగా పెద్ద ఎత్తున హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు.