ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ

NGKL: చారకొండ మండలం జూపల్లి గ్రామానికి చెందిన పార్వతమ్మకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శనివారం మాజీ వైస్ ఎంపీపీ వెంకట యాదవ్ భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల పథకం ఇల్లు లేని నిరుపేదల పాలిట గొప్ప వరమని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇంటిని నిర్మించి ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.