విశాఖలో నాగుల చవితికి ఏర్పాట్లు
VSP: విశాఖలో నాగుల చవితి సందడి మొదలైంది. శనివారం నాగుల చవితిని ఘనంగా జరుపుకునేందుకు ప్రజలు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. చవితి సామాగ్రి కొనుగోళ్లతో శుక్రవారం మార్కెట్లు రద్దీగా కనిపించాయి. నగరంలో సహజసిద్ధమైన పుట్టలతో పాటు, పలు ప్రాంతాల్లో కృత్రిమ పుట్టలను ఏర్పాటు చేశారు. విశాఖ జూ, ఏయూ మైదానం, రైల్వే కార్వర్ట్స్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు.