'శివానందపురంలో సూచికల అవసరం'

'శివానందపురంలో సూచికల అవసరం'

కడప నగరంలోని కలెక్టర్ కార్యాలయం నుంచి రిమ్స్‌కు వెళ్లే రోడ్డులో శివానందపురం ప్రాంతంలో వాహన వేగాన్ని నియంత్రించేందుకు అవసరమైన సూచికలు ఏర్పాటు చేయాలని CPM నగర కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా బుధవారం ఆయన ఆర్ & బి కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగేశ్వర్ రెడ్డిని కలిసి, వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో CPM నాయకులు కూడా పాల్గొన్నారు.