దక్షిణాదిని చూసి బాలీవుడ్ నేర్చుకోవాలి: నటి
సౌత్ ఇండస్ట్రీని చూసి బాలీవుడ్ కొన్ని విషయాలు నేర్చుకోవాలని సోనాక్షి సిన్హా తెలిపారు. దక్షిణాది పరిశ్రమ సమయపాలన పాటిస్తుందని, ఇక్కడ 9 గంటలకు షూటింగ్‌కొస్తే సాయంత్రం 6వరకు మాత్రమే చిత్రీకరణ చేస్తారని చెప్పింది. ఆ తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ షూటింగ్ నిర్వహించరని.. కానీ బాలీవుడ్‌లో అర్ధరాత్రి వరకు జరుగుతుంటాయని, ఈ విషయంలో బాలీవుడ్ మారాలని పేర్కొంది.