VIDEO: 'ట్రాఫిక్ నియమాలు పాటించాలి'
SKLM: ప్రతీ ద్విచక్రవాహనదారుడు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని శ్రీకాకుళం ట్రాఫిక్ ఎస్సై సుధాకర్ సూచించారు. మంగళవారం సాయంత్రం శ్రీకాకుళంలోని అంబేద్కర్ జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా వాహనాలు పత్రాలను పరిశీలించారు. అనంతరం ఆటో డ్రైవర్లకు, ద్విచక్ర వాహనదారులకు ట్రాఫిక్ నియమాలపై పలు సూచనలు చేశారు.