సీఎం చంద్రబాబుకు వినూత్నంగా బర్త్‌డే విషెస్
AP: సీఎం చంద్రబాబుకు కుప్పం నియోజకవర్గం టీడీపీ కార్యకర్తలు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. ఆయన 76వ పుట్టినరోజు సందర్భంగా 7600 మొక్కలతో చంద్రబాబు చిత్రపటాన్ని రూపొందించారు. ఆ మొక్కలను ప్రభుత్వ స్థలాల్లో నాటి సంరక్షించే బాధ్యతను కూడా టీడీపీ కార్యకర్తలు తీసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.