సీఎం చంద్రబాబును కలిసిన విష్ణువర్ధన్ రెడ్డి

సీఎం చంద్రబాబును కలిసిన విష్ణువర్ధన్ రెడ్డి

సత్యసాయి: కదిరి బీజేపే నేత, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మంగళవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. దేశంలోనే అతిపెద్ద ఐటీ విదేశీ పెట్టుబడులు గూగుల్ సంస్థ ద్వారా విశాఖపట్నం రావడంపై ఆయన ముఖ్యమంత్రిని అభినందించారు. రాష్ట్రంలో అభివృద్ధి, మౌలిక వసతుల నిర్మాణం వేగవంతం కావడం సంతోషకరమని అన్నారు.