రాజ్యాధికారం కోసం అలుపెరుగని పోరాటం చేశారు: ఎమ్మెల్సీ

RR: షాద్ నగర్ పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి హాజరై ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సామాజిక సమానత్వం, బహుజనులకు రాజ్యాధికారం కోసం అలుపెరగని పోరాటం చేసిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు.