ప్రజా దర్బార్ సద్వినియోగం చేసుకోండి: ఎమ్మెల్యే
ATP: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్‌ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు కోరారు. రాయదుర్గం ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఆయన పాల్గొని, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 332 అర్జీలు రాగా.. 141 సమస్యలు పరిష్కారమైనట్లు తెలిపారు.