సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
JGL: సారంగాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో, ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఇవాళ 16 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి కింద రూ. 4,69,000, 23 మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మీ పథకం కింద రూ. 23 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఎమ్మార్వో ,పాక్స్ ఛైర్మన్, మండల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.