రేపు మెగా జాబ్ మేళా
SKLM: టెక్కలి పట్టణంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ఉదయం 10 గంటల నుంచి మెగా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ గోవిందమ్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేళాలో పలు సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు అన్నారు. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన విద్యార్థులు అర్హులన్నారు. పూర్తి వివరాలకు నేరుగా కళాశాలలో సంప్రదించాలని సూచించారు.