తిరుమలలో వైభవంగా కార్తీక వనభోజన మహోత్సవం
TPT: తిరుమల పార్వేట మండపంలో కార్తీకమాస వనభోజన మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ మేరకు శ్రీ మలయప్ప స్వామివారిని చిన్న గజవాహనంపై ఊరేగింపుగా తీసుకెళ్లి భూ సమేత స్నపన తిరుమంజనం చేశారు. అయితే ఐదేళ్ల విరామం తర్వాత వేలాది భక్తులు కలిసిరావడం, భక్తి సంగీతం, హరికథలతో ఉత్సవం ఆహ్లాదకరంగా మారింది. సహపంక్తి భోజనం ప్రతి ఒక్కరికి మధుర అనుభూతిని ఇచ్చింది.