'బెంగాలీ టీచర్లను నియమించాలి'

ASF: సిర్పూర్ నియోజకవర్గంలో బెంగాలీ భాషలో ప్రాథమిక ఉపాధ్యాయులు లేక బెంగాలీ మాతృభాష గల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని MLA హరీష్ బాబు గురువారం అన్నారు. కావున బెంగాలీ అభ్యర్థులను ఉపాధ్యాయులుగా బెంగాలీ క్యాంప్ ప్రభుత్వ పాఠశాలల్లో నియమించాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సభ్యసాచి ఘోష్‌ను కోరారు. త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు.