జిల్లాలో ఎండల తీవ్రత.. 40 డిగ్రీలు దాటే అవకాశం
NRML: జిల్లాలో ఎండలు రోజురోజుకూ ఎక్కువ అవుతున్నాయి. ఏప్రిల్ రెండో వారం ప్రారంభం కాకముందే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ప్రస్తుతం జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు 37°C నుంచి 38°C మధ్య నమోదవుతుండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
వాతావరణ శాఖ నివేదికల ప్రకారం, రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశం ఉందన్నారు.