ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తికి గాయాలు

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తికి గాయాలు

KDP: ఖాజీపేట మండలం సిద్ధాంతి పురం గ్రామానికి చెందిన శ్రీనివాసులు రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన తలకు గాయం కాగా, స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించి రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.