ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై

ప్రకాశం: టంగుటూరు మండలంలోని మలవప్పాడు SC పాలెంలో శుక్రవారం రాత్రి స్థానిక ఎస్సై నాగమల్లేశ్వరరావు ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి ఓటిపి, వ్యక్తిగత బ్యాంకు సమాచారం అడిగితే ఎట్టి పరిస్థితులలో చెప్పవద్దని విజ్ఞప్తి చేశారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని సూచించారు.