పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్
MBNR: స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా రెండవ విడత పోలింగ్ ఆదివారం జరుగుతుంది. ఈ సందర్భంగా కోయిలకొండ మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను MBNR జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి సందర్శించారు. మండలంలోని పారుపల్లి రాంపూర్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ నిర్వహించాలని కలెక్టర్ పోలింగ్ అధికారులకు సూచించారు.