జంగాలపల్లి సర్పంచి ఏకగ్రీవం.!
MHBD: గంగారం మండలం జంగాలపల్లి సర్పంచి ఏకగ్రీవం అయ్యారు. ఏకగ్రీవానికి సహకరించి తనను ఆశీర్వదించిన ప్రజలకు రుణపడి ఉంటానని అభ్యర్థి బానోతు తారమ్మ అన్నారు. ఈ మేరకు గంగారం మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జాడి వెంకటేశ్వర్లు తారమ్మను అభినందించారు. మంత్రి సీతక్క ఆశీస్సులతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానన్నారు.