కదిరిలో నేడు శ్రీవారి కల్యాణోత్సవం
SS: కదిరిలోని శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో నేడు ఉదయం 10 గంటలకు శ్రీవారికి ఆర్జిత కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఉ.6 గంటల నుంచి సాధారణ దర్శనం, 7 నుంచి 9 గంటల మధ్య అభిషేక, స్వర్ణకవచ సేవలు ఉంటాయని ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు ఉ. 9 నుంచి మ. 1.30 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 8.30 గంటల వరకు సర్వదర్శనం చేసుకోవచ్చని అన్నారు.