తుంగభద్ర జలాశయం 26 గెట్లు ఎత్తివేత

తుంగభద్ర జలాశయం 26 గెట్లు ఎత్తివేత

KRNL: ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల రైతులకు జీవనాడిగా ఉన్న తుంగభద్ర జలాశయం వరుస వర్షాల కారణంగా మంగళవారం నిండుకుండలా మారింది. దీంతో బోర్డు అధికారులు జలాశయం నుంచి 26గేట్లను ఎత్తి దిగువన గల నదికి నీటిని విడుదల చేశారు. దీంతో నదితీర ప్రాంత గ్రామాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలో ఉన్న నీటి సామర్థ్యం 1,626 అడుగులుగా ఉంది.