ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో

ప్రకాశం: వెలిగండ్ల మండలంలోని నాగిరెడ్డిపల్లిలో బుధవారం ఉపాధి హామీ పనులను బుధవారం ఎంపీడీవో మహబూబ్ బాషా పరిశీలించారు. ఆయన మస్టర్లను పరిశీలించి, పనికి రాని వారికి హాజరు వేయరాదని సిబ్బందికి సూచించారు. ఉపాధి పనుల్లో అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉపాధి కూలీలకు సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.