నానో యూరియా వినియోగంపై అవగాహన సదస్సు
PDPL: పెద్దపల్లి మండలం చికురాయి గ్రామ రైతు వేదికలో అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులు అధిక మోతాదులో యూరియా వాడకుండా నానో యూరియా వినియోగం పెంచాలని జిల్లా సహకార అధికారిణి శ్రీమాల సూచించారు. IFFCO ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నానో యూరియా ప్రయోజనాలను వివరించారు.