బోరు బావికి స్థల పరిశీలన
VZM: జరజాపుపేట హౌసింగ్ కాలనీలో బోరు మంజూరు చేయమని ఇటీవల నెల్లిమర్ల నగర పంచాయతీ వైస్ ఛైర్మన్ సముద్రపు రామారావు కలెక్టర్ రాం సుందర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు మంజూరైన నీటి బోరును పబ్లిక్ హెల్త్ అండ్ హౌసింగ్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో మార్కింగ్ చేశారు. ఈ క్రమంలో పబ్లిక్ హెల్త్ డీఈ. ఈశ్వర్ సమక్షంలో ఇవాళ స్థల పరిశీలన చేశారు.