ఆర్డీవో కార్యాలయంలోకి వర్షపు నీరు

ఆర్డీవో కార్యాలయంలోకి వర్షపు నీరు

కృష్ణా: కలెక్టరేట్ ప్రాంగణంలోని ఆర్డీవో కార్యాలయంలోకి వర్షపు నీరు చేరింది. బ్రిటిష్ కాలంలో నిర్మించినది కావడంతో వర్షాకాలంలో సిబ్బంది, ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. భారీ వర్షాల సమయంలో సీలింగ్ నుంచి నీళ్లు కారడం, గోడలకు చెమ్మ వస్తుండడంతో సిబ్బంది అవస్థలు పడుతున్నారు. రికార్డులను భద్రపరచడం తలకు మించిన భారంగా మారుతోందని వాపోతున్నారు.