రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం
SRD: జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని జంగంపేట గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో జరిగింది. సోమవారం ఉదయం పుణ్యవచనం, లక్ష్మీ గణపతి హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించగా, సాయంత్రం అమ్మవారి ఊరేగింపు అనంతరం కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. మంగళవారం ఒడిబియ్యం బోనాల సమర్పణ ఉంటుందని అర్చకులు తెలిపారు.