ఇంటర్ ఫలితాల్లో సత్తాచాటిన విద్యార్థిని మౌనిక
MHBD: నెల్లికుదురు మండల కేంద్రానికి చెందిన గొట్టిముక్కుల లక్ష్మణ్- రజిత దంపతుల కూతురు గొట్టిముక్కుల మౌనిక ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతుంది. నిన్న ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో ఎంపీసీలో 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించింది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన మౌనికను కళాశాల యజమాన్యం, తల్లిదండ్రులు, మండల ప్రజలు అభినందిస్తున్నారు.