VIDEO: దర్దేపల్లిలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ వైభవం
JN: పాలకుర్తి మండలం దర్దేపల్లిలోని శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతిష్ఠ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా కొనసాగాయి. మూడు రోజులుగా నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా చివరి రోజు సోమవారం భక్తుల ‘శంభో శివ శివ’ నామస్మరణల మధ్య ధ్వజస్తంభ ప్రతిష్ఠ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు, చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.