పంచారామాలకు ప్రత్యేక బస్సు

పంచారామాలకు ప్రత్యేక బస్సు

KMM: కార్తీకమాసం సందర్భంగా ఈనెల 9న నగర కొత్త బస్టాండ్ నుంచి పంచారామాలకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు నడుపనున్నట్లు జిల్లా డిపో మేనేజర్ శివప్రసాద్ తెలిపారు. ఈ మేరకు బస్సు ఆదివారం రాత్రి 8 గంటలకు ఖమ్మం నుంచి బయలుదేరి అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటకు చేరుకుంటుందన్నారు. టికెట్ ధర పెద్దలకు రూ.2,300, పిల్లలకు రూ.1,180గా నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు.