నూతన ఆర్థిక సంవత్సరానికి ఘన స్వాగతం
KNR: ట్రెజరీ కార్యాలయంలో నూతన ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా ట్రెజరీ అధికారి నాగరాజు కేక్ కట్ చేసి, ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన ఆర్థిక సంవత్సరం అభివృద్ధి, పారదర్శకతకు దారితీయాలని, ప్రభుత్వ లక్ష్యాల సాధనలో అందరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు.