ఎన్నికల పర్యవేక్షణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు: కలెక్టర్

ఎన్నికల పర్యవేక్షణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు: కలెక్టర్

KMM: గ్రామపంచాయతీ ఎన్నికల పర్యవేక్షణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేస్తున్న వెబ్ క్యాస్టింగ్ మానిటరింగ్ సెల్‌ను ఆయన బుధవారం పరిశీలించారు. జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు 7 మండలాలకు సంబంధించి జరుగుతున్నాయని తెలిపారు.