ఆ ప్లాట్లు కొనుగోలు చేస్తే నష్టపోవాల్సి వస్తుంది: జేసీ

ప్రకాశం: అనధికార లేఔట్లలో ప్లాట్లు కొనుగోలు చేస్తే నష్టపోవాల్సి వస్తుందని జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ పేర్కొన్నారు. స్థిరాస్తి కొనుగోలుదారులకు అవసరమైన సూచనలు చేసేలా రూపొందించిన పోస్టర్లను బుధవారం ప్రకాశం భవనంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి, విజయకుమార్‌లతో కలిసి ఆవిష్కరించారు.