హత్యాయత్నం.. నలుగురు అరెస్ట్
ATP: అనంతపురంలోని ADCC బ్యాంక్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. 4వ టౌన్ సీఐ జగదీష్ వివరాలు ప్రకారం.. శంకర్ అనే వ్యక్తిని కొంతమంది బలవంతంగా కారు ఎక్కించుకుని వెళ్లారు. అనంతరం వడియంపేట సమీపంలో ఇనుపరాడ్లు, కట్టెలతో దారుణంగా కొట్టి పడేశారు. గాయపడ్డ శంకర్ GGHలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. హత్యాయత్నం కేసు నమోదు చేసి నలుగురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు CI వెల్లడించారు.