'ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయాలి'
BHPL: జిల్లా కేంద్రంలోని లేబర్ కార్మికులకు ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ అరవింద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లేబర్ కార్డు ఉంటే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను అమలు చేయాలని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికుల కుటుంబాలలో శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలకు ఫంక్షన్ హాల్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.