VIDEO: శోభాయాత్రలో చాక్లెట్లు పంచిన కవిత

HYD: గోషామహల్ నియోజకవర్గంలో శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చిన్నారులకు చాక్లెట్లను పంపిణీ చేశారు. యాత్రను తిలకించేందుకు వచ్చిన పిల్లలను పలకరించారు. చాక్లెట్లు పంచుతూ ముందుకు సాగారు. దీంతో చిన్నారులు ఆనందంతో మురిసిపోయారు. ఈ దృశ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం శోభాయాత్రలో పాల్గొన్నారు.