కుల గణన చేస్తామనడం రాష్ట్ర ప్రభుత్వ విజయం

RR: కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా చేసే జనాభా లెక్కల్లో కుల గణన చేస్తామనడం రాష్ట్ర ప్రభుత్వ విజయం అని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కుల గణన చేసి దేశానికి దిక్సూచిగా మారిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన కుల గణన ఆధారంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం చేసే జనాభా లెక్కల్లో కుల గణన చేస్తామని పేర్కొనడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.