కోసిగి నూతన ఎంపీడీవో బాధ్యతల స్వీకరణ
KRNL: కోసిగి నూతన ఎంపీడీవోగా సయ్యద్ మెహబూబ్ బాషా ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పలు గ్రామాలను సందర్శించి, తాగునీటి సరఫరా, స్వచ్ఛ భారత్ కార్యక్రమం, చెత్త నిర్వాహణ, మౌలిక సదుపాయాలపై ప్రజల సమస్యలను వివరంగా తెలుసుకున్నారు. గ్రామాల్లో శుభ్రత, నీటి సదుపాయాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలతో సన్నిహితంగా పనిచేస్తానని ఆయన తెలిపారు.