'పర్యావరణాన్ని ప్రజలే కాపాడుకోవాలి'
VSP: కార్పొరేట్‌తో పాలకులు కలిసి పోయారు. కాబట్టి పర్యావరణాన్ని ప్రజలే కాపాడుకోవాలని మాజీ సుప్రీంకోర్టు జడ్జి వి. గోపాల్ గౌడ్ పిలుపునిచ్చారు. విశాఖ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు. కలుషితమవుతున్న నదులు, చెరువులు, ఆనకట్టలను పరిరక్షించుకోవాలని మంచి ఆక్సిజన్ నీరు అందించవలసిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. నేడు అది కొరవడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.