బీసీ సంఘం బంద్ విజయవంతం

బీసీ సంఘం బంద్ విజయవంతం

NRPT: మరికల్ మండల కేంద్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌తో చేపట్టిన బీసీ బంద్ సంపూర్ణంగా జరిగింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీసీ సంఘం, యువక మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్‌కు వ్యాపారస్తులు సహకరించారు. తమ వ్యాపారాలను స్వచ్ఛందంగా బంద్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరికల్ ఎస్సై రాము, పోలీసులు బందోబస్తు నిర్వహించారు.