హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం

TG: HYDలో సాఫ్ట్వేర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు యువకులను మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.1.5 లక్షల విలువ చేసే 12.6 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. నైజీరియా దేశానికి చెందిన వ్యక్తుల నుంచి తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి, హైదరాబాద్‌లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.