అరిధమన్ ఒక పదం కాదు శక్తి: రాజ్‌నాథ్
AP: విశాఖలో నావల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ ల్యాబొరేటరీ (NSTL)ను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా NSTLలో కావిటేషన్ టన్నెల్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 'అరిధమన్ ఒక పదం కాదు శక్తి. అరిధమన్ భారత్ మూడో స్వదేశీ అణుశక్తి సబ్ మెరైన్. సముద్ర ఆధారిత అణు నిరోధక శక్తిని మరింత బలపరుస్తుంది' అని వెల్లడించారు.