VIDEO: కాంట్రాక్టర్ పై అధికారి రింగ్ బెల్ట్‌తో దాడి
BHPL: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఓ అధికారి వీరంగం సృష్టించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పే అండ్ అకౌంట్స్ అధికారి ఫణిభూషణ్ బిల్లుల విషయంలో నిలదీసిన కాంట్రాక్టర్ పై దాడికి పాల్పడ్డారు. సుమారు రూ.23 లక్షల LOC నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని కాంట్రాక్టర్ ప్రశ్నించగా, సహనం కోల్పోయిన అధికారి టేబుల్ మీద ఉన్న రింగ్ బెల్ట్‌తో అతడిపై దాడి చేశారు.