పోస్ట్ ఆఫీస్ భవనాన్ని నిర్మించాలని ఎంపీకి వినతి

NGKL: కల్వకుర్తి మండలం మార్చాల గ్రామంలో పోస్ట్ఆఫీస్ భవనాన్ని నిర్మించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నాగర్‌కర్నూల్ పార్లమెంటు సభ్యులు మల్లు రవిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా పోస్ట్ ఆఫీస్ భవనం లేక ఇబ్బందుల ఎదుర్కొంటున్నామని మల్లు రవికి వివరించారు.