ఈ నెల 21న జాతీయ లోక్ అదాలత్
SDPT: డిసెంబర్ 21న జరిగే జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సిద్దిపేట జిల్లా న్యాయమూర్తి సాయి రమాదేవి సూచించారు. డిసెంబర్ 13న జరగాల్సిన లోక్ అదాలత్ స్థానిక ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ 21కి మార్చినట్లు వెల్లడించారు. కక్షిదారులు, ప్రజలు గమనించాలన్నారు. లోక్ అదాలత్లో కాంపౌండబుల్, సివిల్, మోటార్ వెహికిల్ కేసులు పరిష్కారం ఉంటుందన్నారు.