VIDEO: శ్రీవారి సేవలో త్రివిక్రమ్ శ్రీనివాస్

TPT: తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆయనకు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనంతో అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల అభిమానులు, భక్తులు ఆయనతో ఫోటోలు దిగారు.