మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి: అదనపు కలెక్టర్
SRPT: ఇందిరా మహిళా శక్తి పథకాలతో మహిళలు ఆర్థికంగా ఎదగాలని అదనపు కలెక్టర్ సీతారామారావు కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో సెంట్రింగ్ పనుల్లో శిక్షణ పొందిన వారికి సర్టిఫికేట్లు అందజేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వీరికి ఉపాధి కల్పించి, బ్యాంకు రుణాల ద్వారా యూనిట్లు ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. దానికి తోడు మహిళలకు తగిన సహకారం అందిస్తామన్నారు.