యువకుడు అదృశ్యం.. నదిలో దూకినట్లు అనుమానం

యువకుడు అదృశ్యం.. నదిలో దూకినట్లు అనుమానం

GNTR: మందడం గ్రామానికి చెందిన యువకుడు అదృశ్యమైన ఘటనపై తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. బేతపూడి శశికుమార్ (23) కనిపించడం లేదని తండ్రి ఫిర్యాదు చేశారు. తాళ్లాయపాలెం శైవక్షేత్రం వద్ద నదిలోకి యువకుడు దూకాడన్న సమాచారం నేపథ్యంలో అక్కడ చెప్పులు లభించడంతో అవి తన కుమారుడివేనని తండ్రి పోలీసులకు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.