నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్
ELR: ముదినేపల్లి మండలంలోని కొత్తపల్లిసబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో మరమ్మతులు కారణంగా శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి 11గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఆ శాఖ ఏఈ పూర్ణచంద్రరావు తెలిపారు. కొత్తపల్లి, నారాయణపురం, ఊటుకూరు, ప్రొద్దుటూరు, వాడపల్లి, దేవపూడి, వణుదుర్రు, అల్లూరు, రామచంద్రాపురంలోని గృహ, వాణిజ్య, ఆక్వా వినియోగదారులు సహకరించాలన్నారు.