'అంటువ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలి'

GNTR: పొన్నూరు పురపాలక సంఘం కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబు మంగళవారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య పనులను సమీక్షించి, వర్షాకాలంలో అంటువ్యాధులు వ్యాపించకుండా తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం పట్టణంలో అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేశారు.