3500 మట్టి గణపతులు పంపిణీ

AKP: మట్టి గణపతితో వినాయక చవితి జరుపుకుందామని గ్రీన్ క్లబ్ కమిటీ ప్రతినిధులు కోరారు. ఆదివారం అనకాపల్లి జనసేన నియోజకవర్గ ఇంఛార్జ్ భీమరశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. సుమారు 3500 విగ్రహాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ఏటా ఇలా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నామన్నారు.